ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పిటిషనర్లపై తొందరపాటు చర్యలొద్దు'

తమ కుటుంబ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించారంటూ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తనయుడు ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో ఇద్దరికి హైకోర్టులో ఊరట లభించింది . ప్రస్తుతానికి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.

hc on udayabhanu son issue
hc on udayabhanu son issue

By

Published : Oct 6, 2021, 6:58 AM IST

సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టి తమ కుటుంబ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించారంటూ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తనయుడు ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో ఇద్దరికి హైకోర్టులో ఊరట లభించింది . వారి అరెస్ట్​తో పాటు ఇతర తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ పోలీసులకు , సామినేని వెంకట కృష్ణ ప్రసాదు నోటీసులు జారీ చేసింది . హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. డ్రగ్ కేసులో వైకాపా నేత సామినేని ఉదయభాను కుమారు వెంకట కృష్ణ ప్రసాద్ అరెస్ట్ అనే శీర్షికతో సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్లు పెట్టి దుష్ప్రచారం చేసి తన , తన తండ్రి , కుటుంబ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారని ప్రసాద్ సెప్టెంబర్ 26 న పోలీసులకు ఫిర్యాదు చేశారు . దాని ఆధారంగా పెనుగంచిప్రోలుకు చెందిన లగడపాటి ప్రవీణ్ కుమార్ , నందిగామ మండలం మాగల్లు గ్రామానికి చెందిన పావులూరి వంశీకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు . తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని వారిరువురు హైకోర్టును ఆశ్రయించారు .

వారి తరపు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపించారు . పిటిషనర్లపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావన్నారు . ప్రతిష్ఠకు భగం కలిగితే పరువు నష్ట పరిహారం కోసం ఇతర ఫోరంను ఆశ్రయించాలి తప్ప .. క్రిమినల్ కేసు నమోదు చేయడానికి వీల్లేదన్నారు . ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. పిటిషనర్ల విషయంలో అరెస్ట్ తో పాటు తొందరపాటు చర్యలొద్దని పోలీసులను ఆదేశించారు

ఇదీ చదవండి:Judges Transfers: హైకోర్టు జడ్జీల బదిలీ.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు నియామకం

ABOUT THE AUTHOR

...view details