ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంజనీర్, అసిస్టెంట్ పోస్టుల భర్తీ నిలిపివేత - petition

తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కడప జిల్లాలో ఇంజనీర్, అసిస్టెంట్ ( గ్రేడ్- 2) పోస్టుల భర్తీని నిలుపుదల చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

హైకోర్టు

By

Published : Aug 28, 2019, 5:40 AM IST

ఇంజనీర్, అసిస్టెంట్( గ్రేడ్ - 2) పోస్టుల భర్తీని నిలపండి

పిటిషనర్ల వినతిపై తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కడప జిల్లాలో ఇంజినీర్, అసిస్టెంట్ ( గ్రేడ్ - 2 ) పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రజనీ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. పంచాయతీరాజ్ శాఖలో సైట్ ఇంజినీర్లు/టెక్నికల్ అసిస్టెంట్లుగా సేవలు అందిస్తున్న తమను క్రమబద్ధీకరించి... ఇంజినీర్, అసిస్టెంట్ ( గ్రేడ్ - 2 ) లను తీసుకోవాలని కోరుతూ కడప జిల్లాకు చెందిన 12 మంది హైకోర్టును ఆశ్రయించారు . కడప జిల్లాకు సంబంధించి ఇంజినీర్ ఇన్ చీఫ్ జరీచేసిన ప్రకటనను సవాలు చేశారు. తమ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని ఈ ఏడాది జులై 11న అధికారులకు వినతి సమర్పించినా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి , పిటిషనర్ల వినతిపై రెండు వారాల్లో తగిన ఉత్తర్వులు జారీచేయాలని ఆదేశించారు. అప్పటి వరకు కడప జిల్లాలో ఇంజినీర్, అసిస్టెంట్ గ్రేడ్ - 2 పోస్టుల భర్తీని నిలిపేయాలని ఆదేశించారు .

ABOUT THE AUTHOR

...view details