కొండవీడు ఘటనపై జనసేనాని స్పందన - kondaveedu
కొండవీడులో రైతు మృతిపై భిన్న కథనాలు వస్తున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
కృష్ణా జిల్లాలో మరణించిన రైతు కోటయ్య విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. అతని మరణంపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయన్న ఆయన...సమీక్ష కోసం జనసేన పార్టీ ప్రతినిధులు ఆ ప్రాంతానికి వెళ్లనున్నారని తెలిపారు. పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా సానుభూతితో వ్యవహరించాలని కోరారు.