విద్యార్థులు ర్యాగింగ్ కు దూరంగా ఉండాలని గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ సూచించారు. మంగళగిరి ఎన్నారై వైద్య కళాశాలలో నిర్వహించిన ఎంబీబీఎస్ మొదటి సంవత్సర విద్యార్థుల పరిచయ కార్యక్రమంలో త్రివిక్రమ వర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు, సామాజిక అంశాలు, శారీరక ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు ఏదైనా సమస్యలు ఎదురైతే అధ్యాపకుల దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. రాగింగ్‌కు పాల్పడితే జీవితాంతం విద్యకు దూరమవాల్సి వస్తుందని విద్యార్థులను హెచ్చరించారు.
'విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి' - గుంటూరు జిల్లా నేటి వార్తలు
గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల పరిచయ కార్యక్రమంలో గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ త్రివిక్రమవర్మ పాల్గొన్నారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని, చదువుతో పాటు శారీరక దృఢత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ త్రివిక్రమవర్మ