ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య - గుడివాడ ఎస్సై ఆత్మహత్య న్యూస్

ఎస్సైగా ఉన్నత ఉద్యోగం... పెళ్లై మూడు నెలలే అయ్యింది. మరి అతనికి ఏ కష్టం వచ్చిందో.. తన అపార్టుమెంటులో ఉరివేసుకొని ప్రాణం తీసుకున్నాడు. అతని సహచరులు మాత్రం అతడి మృతికి వివాహేతర సంబంధమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

gudivada second town si committed suicide
ఉరివేసుకొని గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య

By

Published : Jan 19, 2021, 7:48 AM IST

Updated : Jan 21, 2021, 5:24 PM IST

ఉరివేసుకొని గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య

కృష్ణా జిల్లా గుడివాడ రెండో పట్టణ ఎస్సై పిల్లి విజయ్ ​కుమార్.. తన అపార్ట్​మెంట్​లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయ్​కుమార్​కు మూడు నెలల క్రితమే వివాహమయ్యింది. సమాచారం అందుకున్న సహచర సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.

వివాహేతర సంబంధమే కారణమా?

విజయ్​ కుమార్ మృతికి వివాహేతర సంబంధమే కారణమని సహచర సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏలూరుకు చెందిన విజయ్​ కుమార్ 2012 బ్యాచ్ ఎస్సైగా హనుమాన్ జంక్షన్​లో మెుదటగా బాధ్యతలు చేపట్టారు. కొన్నాళ్లకు నూజివీడుకు చెందిన బ్యూటీషియన్​తో వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలతో.. విజయ్ కుమార్ సస్పెండ్ అయ్యారు.

సస్పెన్షన్ ఎత్తివేసిన తరువాత విజయ్ కుమార్.. గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం ఏలూరుకు చెందిన మహిళతో విజయ్ కుమార్​కు వివాహం జరిగింది. అయినప్పటికీ భార్యను కాపురానికి తీసుకురాకుండా.. బ్యూటీషియన్​తో కలిసి ఆయన ఓ అపార్ట్​మెంట్​లో ఉంటున్నారు. ఈ క్రమంలో బ్యూటీషియన్ ఒత్తిడి వల్లే విజయ్ కుమార్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విజయ్​ కుమార్ మృతదేహాన్ని గుడివాడ ప్రభత్వ ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఎస్ఐ విజయ్ కుమార్ భౌతిక కాయాన్ని ఎస్పీ రవీంద్రబాబు పరిశీలించారు. ఎస్సై విజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. విజయ్ కుమార్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. డిపార్ట్​మెంట్​లో మంచి పేరు ఉన్నా విజయ్ కుమార్ చిన్న వయసులో మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ రవీంద్ర బాబు తెలిపారు.

ఎస్పీ రవీంద్ర బాబు సంతాపం

ఎస్సై విజయ్ కుమార్ మృతదేహాన్ని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు పరిశీలించారు. ఎస్సై కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. విజయ్ కుమార్ మృతిని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామనీ.. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. విజయ్ కుమార్ చిన్న వయసులో మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ రవీంద్ర బాబు తెలిపారు.

ఇదీ చదవండి:మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దీక్ష: దేవినేని

Last Updated : Jan 21, 2021, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details