ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలి'

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సమీక్ష నిర్వహించారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలని సూచించారు.

whip
ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను

By

Published : Jul 23, 2020, 10:31 PM IST

కరోనా నివారణకు ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సూచించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి వారికి వెంటనే టెస్టులు నిర్వహించాలన్నారు. కరోనా తీవ్రత, కట్టడికి చేపడుతున్న నివారణ చర్యలు, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై వైద్యులతో చర్చించారు.

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సమన్వయంతో పనిచేయాలని ఉదయభాను సూచించారు. కరోనా టెస్టులు చేసేందుకు అవసరమైన పరికరాలు, కొవిడ్ వాహనం అందుబాటులో లేదని వైద్యులు ఉదయభాను దృష్టికి తీసుకువచ్చారు. దీంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్​, డీఎంహెచ్​వోతో సామినేని ఫోన్​లో మాట్లాడి సమస్యను వివరించారు. 24 గంటల్లో రాపిడ్ కిట్లు, పీపీఈ కిట్లు, కొవిడ్ వాహనాన్ని అందజేస్తామని అధికారులు తెలిపినట్లు ఉదయభాను వెల్లడించారు.

ఇదీ చదవండి:'కరోనాతో వైద్యులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details