ఈఎస్ఐ అవినీతి కేసులో అరెస్టైన ఏపీ సచివాలయ ఉద్యోగి మురళీ మోహన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈఎస్ఐ కుంభకోణంలో ఆయనపై అభియోగాలు మోపుతూ ఏసీబీ అరెస్టు చేయటంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
జులై 10వ తేదీన సచివాలయంలో మురళీ మోహన్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కార్మిక శాఖ మాజీ మంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన కాలంలో ఈఎస్ఐ కుంభకోణంలో మురళీ పాత్ర ఉందని ఏసీబీ అభియోగాలు మోపింది. ఈ క్రమంలో ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అరెస్టయిన నాటి నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆదేశాలు వెలువడ్డాయి. ప్రస్తుతం పట్టణాభివృద్ధి శాఖలో సెక్షన్ ఆఫీసరుగా మురళీ మోహన్ విధులు నిర్వహిస్తున్నారు.