Government Has Implemented ESMA Act on Anganwadis: అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీవో నెంబర్2 తెచ్చి అంగన్వాడీలపై దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీరి నిరసనకు కాంగ్రెస్, వామపక్ష నేతలు మద్దతు తెలిపారు. హామీలను నెరవేర్చేవరకు వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంక్రాంతిలోగా డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపడతామని హెచ్చరించారు.
CPM leaders support Anganwadis: ఎస్మా చట్టాలకు భయపడేది లేదని కర్నూలు జిల్లా సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ తెలిపారు. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ఉపయోగించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ అంగన్వాడీలకు సీపీఎం నాయకులు మద్దతుగా ఉంటారని తెలిపారు. గతంలో ఎస్మా చట్టాన్ని ప్రయెగించిన ప్రభుత్వాలు ఓడిపోయాయని అదే విధంగా వైసీపీ ప్రభుత్వాం కూడా ఓటమి తప్పదని ఆయన తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది భయపడకుండా సమ్మె చేయాలన్నారు.
సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తాం - ప్రభుత్వ నోటీసులపై అంగన్వాడీల ధ్వజం
Anganwadi Strike in Ongole Collectorate:తమ కార్యకర్తలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపిందని అంగన్వాడీలు మండిపడ్డారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు 24 గంటల దీక్ష శిబిరం నిర్వహించారు. అంగన్వాడీలకు యూటీఎఫ్ ఉద్యోగులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం అంగన్వాడీలకు జీవో నెంబర్2 తీసుకొచ్చి చాలా తప్పు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు 26వేల రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. 27 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్2ను తక్షణమే ఉపసంహరించుకోవాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ఇలాంటి నల్ల జీవోలు తెచ్చిన అంగన్వాడీలు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు భయపడే లేదని తెలిపారు.
బెదిరింపులకు పాల్పడినా సమ్మె విరమించం - స్పష్టం చేసిన అంగన్వాడీలు
Anganwadi Strike in Ananthapuram:అనంతపురం జిల్లా ఉరవకొండలో అంగన్వాడీలు ప్రభుత్వం జారీ చేసిన జీవో పత్రులను దహనం చేశారు. జీవో పత్రులను దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కనీస వేతనం, గ్రాట్యుటీ, ఉద్యోగ భద్రత డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకుంటే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు ఎస్మా జీవో పేపర్లకు నిప్పి పెట్టి అనంతపురంలో అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ముందు 27వ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇలాంటి జీవోలకు బెదిరేది లేదని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. అక్క చెల్లెమ్మలంటూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇవాళ రోడ్డుపైన మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రులు సైతం తమ సమస్యలపై మాట్లాడకపోవడం వారి పాలన నియంత్రణకు నిదర్శనం అన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదన్నారు.
సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదు - 25వ రోజుకు చేరిన అంగన్వాడీల ఆందోళన