ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 13, 2020, 9:13 PM IST

Updated : Dec 14, 2020, 3:37 AM IST

ETV Bharat / state

నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు

రాష్ట్రంలో సోమవారం నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ఈ పరీక్షల కోసం 41 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.

goup-1 mains exams conducted from tomorrow in andhrapradhesh
నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు

గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 9వేల 679 మంది అభ్యర్థులు హాజరు కానుండగా... అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరుగుతాయి. 8గంటల 45 నిమిషాల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 9గంటల 45 నిమిషాలు దాటిన తర్వాత ఏ అభ్యర్థినీ అనుమతించేది లేదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈసారి పరీక్షల్లో తొలిసారిగా ఆభ్యర్థులకు ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్‌లో పొందుపరిచి ఇవ్వనున్నారు. అభ్యర్థి లాగిన్ అయ్యాక తెరపై ప్రశ్నాపత్రం కనిపించేలా ఏర్పాటు చేశారు. కరోనా నివారణ కోసం అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 20 వరకు గ్రూప్‌ వన్‌ మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ 41 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Last Updated : Dec 14, 2020, 3:37 AM IST

ABOUT THE AUTHOR

...view details