కృష్ణా జిల్లా ఉయ్యూరులో సోది చెబుతానంటూ వచ్చి మహిళల మెడలో బంగారం అపహరించి పరారైంది ఓ కిలాడీ లేడీ. ఉయ్యూరు పాత స్టేట్ బ్యాంక్ రోడ్డులో సువర్చలాoజనేయ స్వామి గుడి ఎదురుగా నివాసం ఉండే ఓ మహిళ ఇంటికి సోది చెబుతామంటూ వచ్చి.. ఇంటికి చేతబడి చేశారని మాయమాటలు చెప్పింది. ఆపై దోషాన్ని పోగొడతానని నమ్మబలికించింది. అందంతా నమ్మి ఒంటిమీద ఉన్న ఎనిమిది కాసుల బంగారాన్ని మాయలేడి వద్ద ఉన్న డబ్బాలో వేసింది. అదే అదునుగా భావించి క్షణాల్లో మాయలేడి బంగారంతో అక్కడి నుంచి ఉడాయించింది. బాధితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో మాయ లేడీని వెతికే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. సంఘటనపై ఉయ్యూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సోది చెబుతానంటూ.. బంగారం స్వాహా చేసిన మాయలేడీ - ఉయ్యూరు ఈరోజు క్రైమ్ తాజా వార్తలు
సోది చెబుతానంటూ వచ్చి మహిళల మెడలో బంగారం అపహరించి పరారైంది ఓ కిలాడీ లేడీ. కృష్ణా జిల్లా ఉయ్యూరులో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేను నమోదు చేసి, బంగారం ఎత్తుకెళ్లిన మాయలేడీ కోసం గాలిస్తున్నారు.
సోది చెబుతానంటూ వచ్చి బంగారం అపహరించిన మాయలేడీ