కీసర ట్లోల్ ప్లాజా వద్ద 100 కిలోల గంజాయి పట్టివేత - గంజాయి
ఓ కారులో తరలిస్తోన్న 100 కిలోల గంజాయి కంచికచర్ల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసుల తనిఖీలు చేస్తుండడం గమనించిన నిందితులు... కీసర టోల్ ప్లాజా వద్ద కారు వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశారు. సినీ ఫక్కీలో వెంబడించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
కీసర ట్లోల్ ప్లాజా వద్ద 100 కిలోల గంజాయి పట్టివేత
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. ఓ కారులో తరలిస్తున్న సుమారు 100 కిలోల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులతో సహా కారును స్వాధీనం చేసుకున్నట్లు కంచికచర్ల పోలీసులు తెలిపారు. తనిఖీల సమయంలో నిందితులు కారు వదిలి పారిపోతున్నా.. వెంబడించి పట్టుకున్నట్లు చెప్పారు.