ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్ జోన్ ప్రాంతాల్లో కూరగాయలు పంపిణీ చేసిన గద్దె రామ్మోహన్ - కృష్ణా జిల్లాలో రెడ్ జోన్ ప్రాంతాలు

తెదేపా ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ ..కృష్ణలంకలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో కూరగాయలను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న మాస్కులు, సానిటైజర్లు .. పేద, బడుగు వర్గాల వారు నివసించే ప్రాంతాల్లో అందడం లేదన్నారు. అందుకే ఈ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ఆరోపించారు.

gadde ramohan
gadde ramohan

By

Published : Apr 30, 2020, 5:06 PM IST

విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ కృష్ణలంకలోని పలు డివిజన్లలో కూరగాయలను పంపిణీ చేశారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలు నిత్యావసరాలకోసం ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన.. ఆ ప్రాంతంలోని ప్రతీ ఇంటికీ కూరగాయలను అందించారు. ప్రభుత్వం అందిస్తున్న మాస్కులు, సానిటైజర్లు .. పేద, బడుగు వర్గాల వారు నివసించే ప్రాంతాల్లో అందడం లేదన్నారు. అందుకే ఈ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ఆరోపించారు. లాక్​డౌన్ పూర్తయ్యే వరకు రెడ్ జోన్ ప్రాంతాల్లో కూరగాయలు పంపిణీ చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details