అధికారుల సూచన మేరకు కరోనా వ్యాక్సిన్ అవసరమైన ఫ్రంట్ లైన్ వారియర్స్ వివరాలు సేకరిస్తున్నామని కృష్ణా జిల్లా వైద్యాధికారిణి డా.సుహాసిని అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, నర్సులు, స్వీపర్స్, తాత్కాలిక ఉద్యోగులు, ఆసుపత్రుల్లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది, ఆశా వర్కర్స్, అంగన్ వాడీ వర్కర్స్ వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. వివరాల సేకరణ అనంతరం వాటిని వయస్సు ఆధారంగా ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. వివరాల నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు.
ఫ్రంట్ లైన్ వారియర్స్ వివరాలు సేకరణ - krishna district latest news
కృష్ణా జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణలో కీలక పాత్ర పోషించిన ఆరోగ్య సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. ప్రాధాన్యతను బట్టి వారికి కొవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని జిల్లా డీఎంహెచ్ఓ తెలిపారు.
కృష్ణా జిల్లా వైద్యాధికారిణి డా.సుహాసిని