కృష్ణా జిల్లా గంగూరు గ్రామంలో దాదాపు 50ఏళ్ల నుంచి ముస్లింలే సర్పంచ్‌గా ఎన్నికవుతూ వస్తున్నారు. మధ్యలో ఒక్కసారి వేరొకరికి అవకాశం కల్పించినా మూడున్నర దశాబ్దాల నుంచి ఈ వర్గానికే అక్కడ సర్పంచి పీఠం. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం ఆ గ్రామంలో మహిళకు రిజర్వ్ కావటంతో ముగ్గురు మహిళలు పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఆ ముగ్గురూ ముస్లింలే కావటం విశేషం. గెలిస్తే హిందూ శ్మశానవాటికను అభివృద్ధి చేస్తామంటున్న సర్పంచ్ అభ్యర్థులతో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఆ గ్రామంలో దశాబ్దాలుగా సర్పంచ్ పీఠం వారిదే... - ఏపీ పంచాయతీ ఎన్నికలు న్యూస్
ఆ గ్రామంలో అన్ని కులమతాలు దాదాపు సమాన ఓటర్లే. కానీ దశాబ్దాల నుంచి ముస్లింలే అక్కడ సర్పంచ్‌గా ఎన్నికవుతున్నారు. ఎన్నికైన వారు హిందువుల మనోభావాలను కాపాడేలా ప్రత్యేక చర్యలు చేపట్టడం ఆనవాయితీ.
ఆ గ్రామంలో దశాబ్దాలుగా సర్పంచ్ పీఠంపై కూర్చునేది ముస్లింలే
TAGGED:
ap local elections news