మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డీజీపీ కార్యాలయంలో ఎపిక్ ఫ్యూజన్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్‌ను డీజీపీ గౌతం సవాంగ్ ప్రారంభించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని.. వారి ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా నేడు ఉచిత మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు.
సమాజంలో మహిళల పాత్ర అద్వితీయం: డీజీపీ గౌతం సవాంగ్ - డీజీపీ గౌతం సవాంగ్
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డీజీపీ కార్యాలయంలో ఉచిత మెడికల్ క్యాంప్‌ను ప్రారంభించారు. మహిళలు సమాజంలో తల్లిగా, చెల్లిగా, అక్కగా అద్వితీయమైన పాత్రను పోషిస్తున్నారని డీజీపీ కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రప్రథమంగా మహిళల రక్షణ, భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, సీఎం ఆశయాలకు అనుగుణంగా దిశ ప్లాట్ ఫాం ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టామని డీజీపీ తెలిపారు. ప్రతి ఒక్క మహిళ తప్పనిసరిగా దిశ యాప్‌ను తమ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అధునాతన సాంకేతిక టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దేశానికే తలమానికంగా నిలిచిందని పేర్కొన్నారు. మహిళలు సమాజంలో తల్లిగా, చెల్లిగా, అక్కగా అద్వితీయమైన పాత్రను పోషిస్తున్నారని డీజీపీ కొనియాడారు.
ఇదీ చదవండి