తెలంగాణ మద్యాన్ని తరలించేందుకు అక్రమార్కులు కొత్త దారులు వెతుకుతున్నారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మూడు ఆటోల్లోని సౌండ్ బాక్స్‌లలో తరలిస్తున్న 1085 మద్యం సీసాలను పట్టుకున్నట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఐదు ఆటోలను సీజ్ చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుండి ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామానికి తరలిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.
సౌండ్ బాక్స్‌లలో తెలంగాణ మద్యం తరలింపు..పట్టివేత - telangana liquor caught in krishna district latest news
కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలో మూడు ఆటోల్లోని సౌండ్ బాక్స్‌లలో తెలంగాణ మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 1085 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్ల డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
సౌండ్ బాక్సుల్లో తెలంగాణ మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్