ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా మాజీ ఎమ్మెల్యే సౌమ్య 12 గంటల దీక్ష

తెదేపా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య 12 గంటల నిరసన దీక్ష చేపట్టారు. లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలకు రూ.5వేలు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Former MLA Soumya is a 12-hours strike in krishna district
మాజీ ఎమ్మెల్యే సౌమ్య 12 గంటల దీక్ష

By

Published : May 2, 2020, 1:09 PM IST

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెదేపా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య 12 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు అందించాలని, అన్న క్యాంటీన్​లను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని, చంద్రన్న బీమాను పునరుద్ధరించాలని కోరారు.

లాక్​డౌన్​లో అత్యవసర సేవలందిస్తున్న పోలీసు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లను అందించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ రావు 73 వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details