కృష్ణా జిల్లా నందిగామలోని డీవీఆర్ కాలనీలో పెళ్లికి హాజరై భోజనం చేసిన 10 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడం వల్ల త్వరితగతిన నందిగామ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిన్నటి పెళ్లి వేడుకలో మిగిలిన స్వీట్లను తమతో ఇంటికి తెచ్చుకుని ఈరోజు ఉదయం తిన్నట్లు పెళ్లికి హాజరైన వారు చెబుతున్నారు. వీరిలో ఆరుగురు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురు చిన్నారులను విజయవాడకు తరలించారు. అస్వస్థతకు గురైన వారందరూ ఒకే ప్రాంతానికి చెందినవారని స్థానికులు తెలిపారు.
పెళ్లి వేడుకలో అపశ్రుతి... స్వీట్లు తిని 10 మందికి అస్వస్థత - నందిగామలోని పెళ్లి వేడుకలో పది మందికి అస్వస్థత
సోమవారం పెళ్లి వేడుకలో మిగిలిన స్వీట్లు తిన్న 10 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు.
నందిగామలో స్వీట్లు తిని పది మంది అస్వస్థత