ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నార్తులకు అండగా స్వచ్ఛంద సంస్థలు

రాష్ట్రంలో లాక్​డౌన్ కారణంగా కృష్ణా జిల్లా విజయవాడలో నిరాశ్రయులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నాయి పలు స్వచ్చంద సంస్థలు. ద్వారకా తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలోనూ ప్రసాద వితరణ చేశారు.

food distribution to needy at krishna district
కృష్ణా జిల్లాలో నిరాశ్రయులకు ఆహారం పంపిణీ

By

Published : Mar 29, 2020, 7:46 PM IST

కృష్ణా జిల్లాలో నిరాశ్రయులకు ఆహారం పంపిణీ

లాక్ డౌన్ కారణంగా అన్నార్తులకు ద్వారకా తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ప్రభుత్వం, వైద్యులు చెప్పే జాగ్రత్తలు ప్రజలు పాటిస్తూ కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని ప్రజలను కోరారు.

కరోనా ప్రభావంతో లాక్​డౌన్ కారణంగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి... నిరాశ్రయులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నాయి. విజయవాడ రోటరీ క్లబ్ సభ్యులు పోలీసు శాఖ సహకారంతో నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో నిరాశ్రయులకు ఆహారం, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేపట్టారు. క్లబ్ తరపున సేకరించిన విరాళాలతో రోజుకు 500 మందికి ఆహారం అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details