ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎగిసే ప్రయాణ ప్రాంగణం... గన్నవరం విమానాశ్రయం..

ఏడాది మొత్తం చూసినా లక్ష మంది ప్రయాణికులు ఉండడమే గొప్పగా భావించే గన్నవరం విమానాశ్రయం ఇప్పుడు మొదటి 3నెలల్లోనూ ఈ సంఖ్య దాటిపోతోంది. తొలి త్రైమాసికంలో 3లక్షల 20 వేల మంది గన్నవరంలో కాలు మోపారు.

ఎగిసే ప్రయాణ ప్రాంగణం... గన్నవరం విమానాశ్రయం..

By

Published : Aug 2, 2019, 4:09 PM IST

అమరావతి రాజధాని ప్రాంతంలోని గన్నవరం విమానాశ్రయం నుంచి గత మూడు నెలల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. 2019 తొలి త్రైమాసికంలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లోనే 3 లక్షల 20 వేల మంది దేశీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. నాలుగేళ్ల ముందు వరకూ ఏడాది మొత్తానికి కలిపి చూస్తే మూడు లక్షల మంది ప్రయాణికులకు మించి ఉండే వారు కాదు. తాజాగా 3నెలల్లోనే ఆ సంఖ్య దాటిపోతోంది. గగన మార్గంలో రాకపోకలు సాగించే వారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. విమాన ప్రయాణికులకు సంబంధించి గత 3నెలల నివేదికలో గతేడాది కంటే భారీగా ఈ పెరుగుదల కనిపించింది. 2018లో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ 3.08 లక్షల మంది ప్రయాణించగా.. ఈ ఏడాది మరో 11వేల మంది పెరిగారు. తాజా నివేదిక ప్రకారం నెలకు లక్ష 10 వేల మందికిపైగా ప్రయాణికులు ఒక్క గన్నవరం విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగిస్తున్నారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి త్రైమాసికంలో ప్రయాణికుల రద్దీ

2018 సంవత్సరంలో

నెల రాక పోక మొత్తం
ఏప్రిల్‌ 50,640 47,358 97,998
మే 54,659 53,769 1,08,428
జూన్‌ 54,544 48,016 1,02,560

2019 సంవత్సరంలో

నెల రాక పోక మొత్తం
ఏప్రిల్‌ 49,316 47,354 96,670
మే 58,554 54,941 1,13,495
జూన్‌ 58,361 51,939 1,10,300


గన్నవరం విమానాశ్రయం నుంచి నిత్యం 60 విమాన సర్వీసులు దేశంలోని 8నగరాలకు ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక్కడి నుంచి ఇతర నగరాలకు ఈ సర్వీసుల్లో వెళ్లే వారి కంటే.. అటునుంచి వస్తున్న వారే అధికంగా ఉంటున్నారు. అంతర్జాతీయ విమాన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపితే గన్నవరం విమానాశ్రయం ఓ ఘనమైన విమానాశ్రయంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు ప్రయాణికులు.

ఇవీ చదవండి

'పరిహారం కోసం.. వర్షంలోనూ అన్నదాతల ఆందోళన'

For All Latest Updates

TAGGED:

AIRPORT

ABOUT THE AUTHOR

...view details