ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా నదిలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి - కృష్ణా నదిలో నలుగురు గల్లంతు వార్తలు

కృష్ణా నదిలో ఐదుగురు గల్లంతైన ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద జరిగింది. వీరిలో ఒకరు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. వీరయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.

krishna river
krishna river

By

Published : Oct 3, 2020, 6:33 PM IST

Updated : Oct 3, 2020, 10:37 PM IST

కృష్ణా నదిలో ఐదుగురు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వైకుంఠపురానికి చెందిన ఐదుగురు.. స్నేహితులు. వీరిలో ముగ్గురు తాపీ పని చేసేవారు. ఒకర డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి.

ఘటన వివరాలు...

వైకుంఠపురం లో నివసించే వీరయ్య (45) తాపీ పనులు చేస్తూ కొన్ని రోజులుగా పనులు లేని కారణంగా... తన ఇద్దరు కుమారులైన సూర్య (19), సాయితో రొయ్యూరులోని నదికి వెళ్లాడు. చేపలు పట్టడానికి వెళ్లిన విషయం తెలుసుకుని వీరయ్య స్నేహితులు వెంకటేశ్వరరావు(35) రంజిత్(35) సైతం నది వద్దకు వెళ్లారు. చేపలు పట్టడం పూర్తయిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో వీరయ్య, అతని చిన్న కుమారుడు సూర్యతో పాటు స్నేహితులు వెంకటేశ్వరరావు, రంజిత్ నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయారు. వీరయ్య పెద్ద కుమారుడు అదృష్టవశాత్తు బయటపడ్డాడు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో వీరయ్య మృతదేహాం లభించింది.

ఇదీ చదవండి:

'మళ్లీ పుట్టిన గాంధీ'... ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు?: రఘురామ

Last Updated : Oct 3, 2020, 10:37 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details