ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా నదిలో చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులు

గెదేల కోసం వరద నీటిని దాటి వేరే గ్రామానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు తిరిగి ఇంటికి చేరుకోలేదు. వారిని కనిపెట్టేందుకు వారి గ్రామస్థులు గాలింపు చేపట్టారు.

By

Published : Aug 17, 2019, 8:57 AM IST

Updated : Aug 17, 2019, 10:33 AM IST

అదృశ్యం

లభించని ఐదుగురు ఆచూకీ

కృష్ణా నది మధ్యలోని లచ్చిగానిలంకలో ఐదుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. బాధితులది కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంక. 20 గేదెలు, 2 జతల ఎడ్ల కోసం నిన్న ఉదయం వీరంతా లచ్చిగానిలంకకు వెళ్లారు. ఓ వ్యక్తి వీరిని పడవలో ఆ గ్రామంలో దించేసి తిరిగివచ్చాడు. అయితే నిన్న రాత్రి 10 గంటల వరకు ఫోన్లో మాట్లాడారని గ్రామస్థులు చెప్పారు. లంకలో మెరకగా ఉన్న చోటుకు కూడా వరద నీరు వస్తుందని తెలిపారని వెల్లడించారు. రాత్రి 11 గంటల నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంకలో చిక్కుకున్న వారిని కనిపెట్టేందుకు ఆముదార్లంక గ్రామస్థులు పడవలో లచ్చిగానిలంకకు వెళ్తున్నారు. చిక్కుకున్నవారిని చిలుమూరి జీవరత్నం, గుంటూరి కిరణ్, గోరికపూడి నాగేశ్వరరావు, గుంటూరు మోహనరావు, కొండలుగా గుర్తించారు.

Last Updated : Aug 17, 2019, 10:33 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details