ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల అదుపులో ఐదుగురు క్రికెట్ బుకీలు - క్రికెట్ బెట్టింగ్​ను అడ్డుకున్న నూజివీడు పోలీసులు

అవతార్​ యాప్ ద్వారా నూజివీడులో బెట్టింగ్​ నిర్వహిస్తున్న.. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల వాసులు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా సెల్​ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఐదుగురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

cricket bookies arrest in nuziveedu
క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసిన పోలీసులు

By

Published : Nov 6, 2020, 7:16 PM IST

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఐదుగురు బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా నూజివీడులో.. శ్రీనివాస రావు అనే వ్యక్తితో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద లభించిన కమ్యూనికేషన్ బాక్స్, 21 సెల్ ఫోన్లు, లాప్ టాప్​లను సీజ్ చేశారు. 22 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

దిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్​పై.. అవతార్ క్రికెట్ బెట్టింగ్ యాప్ ద్వారా నిందితులు బెట్టింగ్​కు పాల్పడినట్లు నూజివీడు ఇన్ఛార్జ్ సీఐ శ్రీను తెలిపారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా బెట్టింగ్ నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను పట్టుకున్న ఎస్సైలు గణేష్ కుమార్, సత్యనారాయణతో సహా సిబ్బందిని.. జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. రివార్డుల కోసం సిఫారసు చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details