ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డివైడర్‌ను ఢీ కొట్టిన డంపింగ్ వాహనం.. దూకేసిన డ్రైవరు - van

రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టిన డంపింగ్ వాహనంలో మంటలు చెలరేగాయి. పాతపాడు డంపింగ్ యార్డుకు చెత్త తీసుకెళ్తుండగా ఘటన జరిగింది.

fire-on-dumping-van

By

Published : Aug 8, 2019, 10:35 AM IST

Updated : Aug 8, 2019, 12:54 PM IST

డివైడర్‌ను ఢీకొనటంతో డంపింగ్ వాహనంలో మంటలు

విజయవాడ రామవరప్పాడు ఫ్లై ఓవర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద... చెత్త డంపింగ్ వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఆ వెంటనే వాహనంలో మంటలు చెలరేగాయి. మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన వాహనం... విజయవాడ నుంచి పాతపాడు డంపింగ్ యార్డుకు వెళ్తుండగా ఈ ఘనట జరిగింది. మంటలు గమనించిన డ్రైవర్ వాహనం నుంచి దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. విషయం తెలుకున్న అగ్నిమాపక సిబ్బంది... ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

Last Updated : Aug 8, 2019, 12:54 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details