కృష్ణాజిల్లా ఘంటసాల మండలం జీలగలగండి సమీపంలో అదుపుతప్పి ఓఎన్జీసీకి చెందిన ఫైరింజన్ బోల్తా పడింది. అదే సమయంలో బందరు కోర్టుకు వెళుతున్న చల్లపల్లి ఎస్ఐ బి.శ్రీనివాసరావు సహాయక చర్యలు చేపట్టారు. ఎస్ఐ విజ్ఞప్తి చేయటంతో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ ప్రతినిధులు క్రేన్, జేసీబీలను పంపగా వాటి సహాయంతో లోపల ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీశారు. డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అదుపుతప్పి ఫైరింజన్ బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు - jilagala gandi
కృష్ణా జిల్లా జీలగలగండి వద్ద అదుపుతప్పి ఓఎన్జీసీకి చెందిన అగ్నిమాపక శకటం బోల్తాపడింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఫైరింజన్ బోల్తా