కృష్ణా జిల్లా గుడివాడ రాజేంద్రనగర్లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మానస సరోవర్ అపార్ట్‌మెంట్‌లోని పిన్నమనేని బేబి సరోజినికి చెందిన 503వ ప్లాట్లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. మంటలు ఎగిసిపడిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఇతర ఫ్లాట్లకు వ్యాపించకుండా అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా నిర్ధరించారు.
Fire Accident: అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడ్డ మంటలు - కృష్ణా జిల్లాలో చేలరేగిన మంటలు
కృష్ణా జిల్లా గుడివాడ రాజేంద్రనగర్లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఇతర ప్లాట్లకు మంటలు అంటుకోకుండా అదుపు చేశారు.
అపార్ట్‌మెంట్‌లో చేలరేగిన మంటలు