విజయవాడలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. మాస్కు ధరించకుండా రోడ్ల పైకి వచ్చే వారికి జరిమానా విధిస్తున్నారు. గడిచిన అయిదు రోజుల్లో 15 వేల మందికి, రూ.10.50 లక్షల మేర జరిమానా విధించినట్లు సీపీ బీ.శ్రీనివాసులు తెలిపారు. అర్హులైన వారందరూ కరోనా వ్యాక్సిన్ను తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే తప్ప జనసమూహాల్లో తిరగవద్దని, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
అయిదు రోజుల్లోనే రూ.10.50 లక్షలు జరిమానా: సీపీ శ్రీనివాసులు
విజయవాడలో కరోనా కేసుల విస్తృతి దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. మాస్కులు లేకుండా బయటకు వచ్చే వారికి జరిమానా విధిస్తున్నారు.
విజయవాడ సీపీ శ్రీనివాసులు