ఇసుక క్వారీ వద్ద ఘర్షణ.. ఒకరికి గాయాలు - one injured
ఇసుక క్వారీలో ఇరువర్గాల మధ్య చెలరేగిన పంచాయితీ వాగ్వాదానికి దారి తీసింది.
కృష్ణా జిల్లా తోట్లవల్లూరు ప్రభుత్వ ఇసుక క్వారీ వద్ద ఉద్రిక్తత నెలకొెంది. చిన్న విషయంలో చెలరేగిన ఘర్షణ కారణంగా ఉచిత ఇసుక క్వారీని అధికారులు నిలిపివేశారు. తనకు చెందిన పొలంలో ట్రాక్టర్ దిగిందని ముఠాకార్మికునిపై రైతు దాడి చేయటంతో... క్వారీ కార్మికులు, రైతు వర్గానికి మధ్య ఘర్షణ నెలకొంది. దీనిలో చీలి హరీష్(21) గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఠా కార్మికులు ధర్నాకు దిగారు. తోట్లవల్లూరు తహశీల్దార్ కార్యాలయం ముందు రోడ్డపై ట్రాక్టర్లు అడ్డు పెట్టి నిరసన తెలిపారు.