దిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా కృష్ణా జిల్లా పల్లగిరిలో రైతులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు బడా పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసం తెచ్చినవని... ఆ చట్టాలను రద్దు చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. పంటలకు మద్దతు ధర ప్రకటించి, రుణాల మాఫీకి చట్టం చేయాలన్నారు. 20 రోజులుగా చలిని కూడా లెక్కచేయకుండా లక్షలాది మంది రైతులు మహిళలతో సహా దిల్లీలో పోరాడుతున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నదని నాయకులు ఆరోపించారు. పైగా రైతు ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల పోరాటానికి మద్దతుగా కృష్ణా జిల్లాలో కొవ్వొత్తులతో నిరసన - పల్లగిరిలో రైతుల నిరసన
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా కృష్ణా జిల్లాలో అన్నదాతలు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు . కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని ఆరోపించారు.
కొవ్వొత్తుల నిరసన