ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Farmers problems: ధాన్యానికి ధర లభించక రైతుల కష్టాలు - farmers problems with not buying paddy grain

రబీ పంటకు మద్దతు ధర లభించక ధాన్యం రైతులు కష్టాలు పడుతున్నారు. గత్యంతరం లేక కొందరు నష్టానికి అమ్ముకుంటుంటే మరికొందరు ధర లభిస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు గోనె సంచులు ఇచ్చాక ఇక పట్టించుకోవట్లేదంటున్నారు. రోడ్డుపైనే ధాన్యం బస్తాలను నిల్వ ఉంచుకుని పడిగాపులు కాస్తున్నారు.

farmers problems with not buying paddy grain in krishna district
ధాన్యానికి ధర లభించక రైతుల కష్టాలు

By

Published : Jun 3, 2021, 10:11 PM IST

ధాన్యానికి ధర లభించక రైతుల కష్టాలు

కృష్ణా జిల్లాలో రబీ సీజన్‌లో 6 లక్షల 645 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఇప్పటికి 2లక్షలకు పైగా పూర్తి చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామంటున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. తుపానుతో ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు రబీలో తేరుకుందామనుకుంటే ఈసారీ మొండిచెయ్యే ఎదురవుతోంది. 45 రోజుల క్రితమే కోతలు పూర్తి చేసినా కొనుగోళ్లు లేవని వాపోతున్నారు.

ప్రభుత్వం సూచించిన రకాన్నే సాగు చేసినా ఏవేవో కారణాలతో కొనుగోలు చేయట్లేదని రైతులు చెబుతున్నారు. ఆర్​బీకేలు, కొనుగోలు కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నామంటున్నారు. రబీలో పండించిన ధాన్యం ముక్కలవుతోందని, నూక ఎక్కువ వస్తోందని, తెల్లమచ్చ ఉందన్న కారణాలతో ధర విపరీతంగా తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమకు దారి చూపాలని లేకుంటే వరి సాగుకు వెనుకంజ వేసే పరిస్థితులు వస్తాయంటున్నారు.

ఇవీచదవండి.

Chandrababu: గృహ నిర్మాణ రంగంపై సీఎం జగన్​వి గాలి మాటలు​: చంద్రబాబు

ఆ విద్యార్థులకు మోదీ సర్​ప్రైజ్​

ABOUT THE AUTHOR

...view details