ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరి నారుమడులు మునిగిపోతున్నాయంటూ రైతుల ఆవేదన - farmers problems news

కృష్ణాజిల్లా నాగాయలంక మండలం, బర్రంకుల పరిసర గ్రామాల్లో... వరి నారుమడులు మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత డ్రైనేజీ అధికారులు వెంటనే స్పందించి వలకట్లు తొలగించాలని రైతులు కోరుతున్నారు.

farmer problems
వరి నారుమడులు మునిగిపోతున్నాయంటూ రైతుల ఆవేదన

By

Published : Aug 2, 2020, 4:54 PM IST

కృష్ణాజిల్లా నాగాయలంక మండలం బర్రంకుల పరిసర గ్రామాల్లో వరి నారుమడులు మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగలేరు మురుగు డ్రెయిన్​పై వలకట్లు కట్టడంతో మురుగు నీరు సముద్రంలోకి వెళ్లడానికి... అడ్డుగా పాతిన కర్రలు, వలల మూలంగా వర్షం పడినప్పుడు నీరు కిందకి వెళ్లలేక వందల ఎకరాల్లో నాటిన వరి నారుమడులు నీటిలో మునిగిపోయాయి. సంబంధిత డ్రైనేజీ అధికారులు వెంటనే స్పందించి వలకట్లు తొలగించాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details