ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 13, 2021, 4:18 PM IST

ETV Bharat / state

పోలీసులమని చెప్పి గొర్రెను ఎత్తుకెళ్లిన దొంగలు అరెస్ట్

పోలీసులమని అని చెప్పి గొర్రెల కాపరిని బెదిరించి గొర్రెను ఎత్తుకెళ్లారు ముగ్గురు వ్యక్తులు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు గుడివాడ సీఐ అబ్దుల్ నబీ తెలిపారు.

fake police arrest
గుడివాడలో నకిలీ పోలీసు అరెస్ట్

పోలీస్ సిబ్బంది అని చెప్పి దొంగతనం చేసిన వారిని అరెస్ట్ చేసినట్లు గుడివాడ సీఐ అబ్దుల్ నబి తెలిపారు. సోమవారం రాత్రి పోలీస్ సిబ్బంది అని చెప్పి కుందేటి వెంకన్న బాబు అనే గొర్రెల కాపరిని బెదిరించి గొర్రెను ఎత్తుకొని వెళ్లిన నిందితులను అరెస్ట్ చేశారు. నందివాడ గ్రామానికి చెందిన పూర్ణ, జగదీశ్ అతనికి సహకరించారని వారిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details