ఎలాంటి సమాచారం, నోటీస్ ఇవ్వకుండా ఇందుగపల్లికి చెందిన నిరుపేద మహిళ మీద అధికార పార్టీ దౌర్జన్యాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి.. మొలా పుల్లమ్మకు న్యాయం చేస్తామని మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తెలిపారు. ఏ కారణంతో తన ఇంటిని కూలుస్తున్నారో తెలియని స్థితిలో ఆ మహిళ ఉందని వివరించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా... క్షేత్రస్థాయిలో అధికారుల చేతల్లో ఎటువంటి మార్పు రావడం లేదని ఆక్షేపించారు. ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన రెవెన్యూ, పోలీస్ అధికారులకు కోర్టు ద్వారా తగిన బుద్ధి చెప్తామన్నారు. అధికారం శాశ్వతం కాదని అందరూ గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు. పుల్లమ్మకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని రాజగోపాల్ స్పష్టం చేశారు.
'అధికారం శాశ్వతం కాదు.. గుర్తు పెట్టుకోండి' - శ్రీరాం రాజగోపాల్ తాజా వార్తలు
వైకాపా నేతల అండతో... అధికారులు పేదలపై జులుం ప్రదర్శిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఆరోపించారు. అధికార పార్టీ దౌర్జన్యాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లి... బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్