రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని కృష్ణా జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. 'పసుపు చైతన్యం' కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పల్లంపల్లి గ్రామ రైతులు, తెదేపా నాయకులతో కలిసి మొక్కజొన్న కల్లాలు పరిశీలించారు. రైతుల వద్ద పంట కొనుగోలు చేయటంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో సుబాబులు టన్నుకు రూ.5వేలు ఇప్పిస్తామన్న అధికార పార్టీ నాయకులు.. ఏమై పోయారని నిలదీశారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: తంగిరాల సౌమ్య - వైకాపా ప్రభుత్వంపై తంగిరాల సౌమ్య వ్యాఖ్య
రైతుల వద్ద పంట కొనుగోలులో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కృష్ణా జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆరోపించారు. రైతుల వద్ద పార్టీలకతీతంగా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
thangirla soumya visit pallampalli
రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని మానుకొని.. రైతుల వద్ద పార్టీలకతీతంగా పంట కొనుగోలు చేయాలని తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చుకోవాల్సిన పని ఉందా..? : హైకోర్టు