కృష్ణాజిల్లా పెనమలూరులో ఇళ్ల స్థలాల విషయంలో వైకాపా నేతలు అవినీతి చేశారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆరోపించారు. ఎకరాకు 25 కోట్ల రూపాయల చొప్పున 150కోట్ల రూపాయలు దండుకున్నారని విమర్శించారు.
'వైకాపా నేతలు తెదేపా అభ్యర్థులను భయపెడుతున్నారు'
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి వైకాపా నేతలు అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆరోపించారు. తెదేపా అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్
ఎలాంటి అనుమతులు లేకుండానే.. వేలాది లారీలతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని దుయ్యబట్టారు. దీనిపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీశారు. అవినీతి సొమ్ముతో తెదేపా అభ్యర్థులను బెదిరిస్తూ సంక్షేమాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. ప్రజలు భయపడకుండా.. మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:'నిర్బంధ ఏకగ్రీవాలు ఇప్పుడే చూస్తున్నా'