రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను అణగదొక్కాలని వైకాపా ప్రభుత్వం చూస్తోందని తెదేపా నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ప్రతిపక్షాల్లోని ఆయా వర్గాల నాయకులపై కుట్ర రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపించారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
'అణగారిన వర్గాల నాయకులపై వైకాపా కుట్ర రాజకీయాలు' - tdp leader kollu ravindra latest news
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తనపై పథకం ప్రకారమే అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశిస్తే వైకాపా సర్కార్ను గద్దె దించేందుకు రాష్ట్రవ్యాప్త పోరాటం సాగిస్తానన్నారు.
రాష్ట్రంలో అరాచకపాలన నడుస్తోందని కొల్లు విమర్శించారు. చంద్రబాబు ఆదేశిస్తే రెట్టింపు ఉత్సాహంతో వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించేలా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం సాగిస్తానన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం.. మద్యం మాల్స్ పేరుతో మరింత దోపిడికి ప్రయత్నించడం సిగ్గు చేటన్నారు. పథకం ప్రకారం తనపై అక్రమ కేసుల బనాయించడం బాధకలిగిస్తోందన్నారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా నిర్దోషిగా బయటపడతానని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు విశ్వాసం ఉందన్నారు.
ఇదీ చదవండి: మంత్రి పెద్దిరెడ్డిని పోలీసు స్టేషన్లో విచారణ చేయాలి: వర్ల