స్థానిక వైకాపా ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య జరిగిందని, అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. బలహీనవర్గాల్లోని నాయకత్వాన్ని అణచివేయాలన్న ఉద్దేశంతోనే వైకాపా సర్కార్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సాగిస్తున్న దురాగతాలను, ఇళ్లపట్టాల్లో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకే సుబ్బయ్యను హత్య చేశారని కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
'వైకాపా ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే నందం సుబ్బయ్య హత్య' - nandham subbayya murder news
తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్న ఆయన... స్థానిక వైకాపా ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో బలహీనవర్గాల్లోని నాయకత్వాన్ని అణగదొక్కేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర