ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉద్యమమే ఊపిరిగా' బతికిన ఆ గుండె ఆగిపోయింది!

విప్లవ నేత చల్లపల్లి శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. పీడిత ప్రజలవైపున ఆయన గొంతుకగా నిలిచారు. ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు.

'ఉద్యమమే ఊపిరిగా' బతికిన ఆ గుండె ఆగిపోయింది
'ఉద్యమమే ఊపిరిగా' బతికిన ఆ గుండె ఆగిపోయింది

By

Published : Aug 26, 2020, 4:44 PM IST

ఉద్యమమే ఊపిరిగా బతికిన చల్లపల్లి శ్రీనివాసరావు అనారోగ్యంతో కన్నుమూశారు. కృష్ణా జిల్లా, కోడూరు మండలం, దింటి మెరక గ్రామానికి చెందిన ఆయన పేద ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ఎర్ర పులిగా పేరుగాంచిన ఆయన.. జీవితాంతం పేదల కోసం అడవి జనం శ్రేయస్సు కోసం కృషి చేశారు. దివిసీమలో పేద ప్రజల భూముల కోసం పోరాడి.. భూ పంపిణీ చేసేలా అనేక ఉద్యమాలు చేశారు.

ఉద్యమమే ఊపిరిగా... అనే పుస్తకంలో ఆయన చెప్పిన కొన్ని మాటలు..

కొన్ని దశాబ్దాలు.. నా కళ్ల ముందు కరిగిపోయాయి. కనీసం ఒక అర్ధశతాబ్దాన్ని అతి సమీపంగా పరిశీలించే అవకాశం నాకు లభించింది. ప్రజలే నిజమైన చరిత్ర నిర్మాతలనే వాస్తవాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నిరంతరం ప్రజల మధ్య జీవిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారమే జీవిత పరమావధి అని భావించాను. అందుకోసమే నా జీవితాన్ని వెచ్చించాను. నా రాజకీయ జీవితంలో ప్రత్యేకించి నేనేదో సాధించానని కాదు. విప్లవోద్యమంలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగినందుకు నాకు చాలా సంతృప్తిగా వుంది. అంతే కాదు, విప్లవోద్యమం కోసం తమ జీవితాలను ధారబోసిన మహనీయులకు అత్యంత సన్నిహితంగా ఉండే అవకాశం కల్పించిన విప్లవోద్యమానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను.

ABOUT THE AUTHOR

...view details