ETV bharat Effect: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించిన మహిళ ఆరుద్ర అవేదనపై ఈటీవీ, ఈటీవీ భారత్ ప్రసారం చేసిన వరుస కథనాలపై పలువురు స్పందించారు. ఆరుద్ర స్థితి చూసి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు స్పందించారు. ఆమెను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుద్రకు లక్ష 11 వేల 111 రుపాయలను అందించారు. చదలవాడ శ్రీనివాసరావు బంధువులు లక్ష్మీ నారాయణ, చంద్రశేఖరరెడ్డిలు ఆరుద్రకు నగదును అందచేశారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆరుద్రను ఫోన్లో పరామర్శించారు.
నా సమస్యను ఈటీవీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిందని ఆరుద్ర పేర్కొన్నారు. ఈటీవీ వారికి రుణపడి ఉంటానని సంతోషం వ్యక్తం చేశారు.
ఈటీవీ కథనంతో ఆరుద్రకు అందిన సాయం.. - vijayawada latest news
ETVbharat Effect: ఆరుద్ర అవేదనపై ఈటీవీ, ఈటీవీ భారత్ ప్రసారం చేసిన కథనాల ద్వారా ఆమెకు సహాయం అందింది. ఆరుద్ర స్థితి చూసి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆమెకు లక్ష 11 వేల 111 రూపాయలను అందించారు. ఈటీవీలో ప్రసారమైన ఆరుద్ర కథనానికి స్పందించి చదలవాడ.. ఆర్థిక సహాయం అందించారని ఆయన బంధువు లక్ష్మీ నారాయణ తెలిపారు.
Etv effect
Last Updated : Nov 5, 2022, 7:52 PM IST