ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించేందుకు... భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆషాఢ మాసంలో తొలిరోజు అమ్మవారికి సారె సమర్పణకు దుర్గామల్లేశ్వర దేవస్థానంలోని మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ప్రారంభంలో భాగంగా... ఆలయ ఈవో కోటేశ్వరమ్మ దంపతులు, అనంతరం శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వారు సారె సమర్పించారు. స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో సారె సమర్పణతో మొక్కులు తీర్చుకున్నారు. పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, పండ్లు, పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పించారు.
అనంతలోకాల తల్లికి.. ఆషాఢ సారె సమర్పణ - devotees
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ వారికి... ఆషాడ సారె సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
కనకదుర్గమ్మ