కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పేఅండ్అకౌంట్స్ కార్యాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీఎన్జీవోస్ నాయకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్జీవో సంఘ నేతలు 3 రాజధానులు ప్రతిపాదనకు తాము వ్యతిరేకం కాదని.. కానీ విశాఖలో తమకు తగిన సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి కోరారు.
'మూడు రాజధానులను స్వాగతిస్తున్నాం... సౌకర్యాలు కల్పించండి'
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి ఉద్యోగ సంఘాల తరఫున తాము కట్టుబడి ఉన్నామని, కానీ రాజధాని తరలించే ముందు ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్రెడ్డి కోరారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ ఎన్జీవో అసోసియోషన్ రాష్ట్ర అధ్యక్షులు