ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటో బోల్తా... 8 మందికి గాయాలు - auto over turned latest news

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడి 8 మందికి గాయాలయ్యాయి.

road accident
రోడ్డు ప్రమాదం

By

Published : Jan 5, 2021, 2:02 PM IST

అవనిగడ్డ మండలం వేకనూరు శివారు గాజులవారిపాలెం వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్​తో సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఆటో డ్రైవర్​ను మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. మరో ముగ్గురు మహిళలకు స్వల్పంగా గాయాలయ్యాయి. బాధితుల్లో 8 నెలల గర్భిణి సైతం ఉంది. ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details