ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆన్లైన్​లో చదువులెలా?.. టీవీలు, మొబైల్స్ లేని వారి సంగతేంటి?

కరోనాతో విద్యా సంస్థలు మూతపడటంతో విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు అందించేందుకు విద్యాశాఖ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో కనీసం టీవీ సౌకర్యం లేని వారు 20 శాతం మంది ఉన్నారు. కేవలం 5 శాతం మంది విద్యార్థుల వద్దే ప్రత్యేకంగా మొబైల్​ ఫోన్​, అందులో డేటా ఉంది.

Education Department Survey on Online Classes
అన్​లైన్​ తరగతులపై విద్యాశాఖ సర్వే

By

Published : Jun 13, 2021, 7:03 AM IST

Updated : Jun 13, 2021, 10:41 AM IST

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 20% మంది విద్యార్థులకు కనీసం టెలివిజన్‌ (టీవీ) సౌకర్యం లేదు. డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌ ఉన్నవారు ఒక్కరూ లేరు. పిల్లలకు ప్రత్యేకంగా మొబైల్‌ ఫోన్‌, అందులో డేటా ఉన్నవారు 5% మందే. కరోనాతో విద్యా సంస్థలు మూతపడటంతో విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు అందించేందుకు విద్యాశాఖ సర్వే నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. ఇప్పటి వరకు సుమారు 38 లక్షల మంది వివరాలను సేకరించారు.

విద్యార్థులకు ఉన్న సదుపాయం ఆధారంగా ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ పాఠాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాల వారీగా ఎవరికి వారు అందుబాటులో ఉన్న సదుపాయాలతో తరగతులు నిర్వహిస్తున్నారు. కొందరు వాట్సప్‌ గ్రూపులు, యూట్యూబ్‌ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ప్రణాళిక రూపొందించగా.. మరికొన్నిచోట్ల విద్యార్థుల ఫోన్‌ నంబర్లు సేకరించే పనిలో ఉపాధ్యాయులు ఉన్నారు.

భారంగా మారుతున్న డేటా..

కరోనాతో ఉపాధి కోల్పోవడం, కొందరికి ఆదాయం తగ్గిపోవడంతో మొబైల్‌ డేటా సమస్యగా మారుతోంది. ఫోన్‌ ఉన్నప్పటికీ ప్రతి నెలా డేటాకు రూ.150-250 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది పేదవారికి భారంగా మారుతోంది. ఫోన్లు తల్లిదండ్రుల వద్ద ఉంటుండటంతో విద్యార్థులు తరగతులకు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడుతోంది. పనుల కోసం బయటకు వెళ్లే కుటుంబ పెద్దలు ఫోన్లు తీసుకుని వెళ్తుండటంతో వారు వచ్చే వరకు పిల్లలు ఎదురుచూడాల్సి వస్తోంది.

  • మొబైల్‌ అందుబాటులో లేనివారు: 18%
  • ఫోన్‌ ఉన్న 82శాతం మందిలో 2జీ ఫోన్లు ఉన్నవారు: 27%
  • ఫోన్‌తోపాటు మొబైల్‌ డేటా అందుబాటులో ఉన్న తల్లిదండ్రులు: 20%

ఇదీ చదవండి:

రూ. 12కే ఇల్లు.. ఎక్కడో తెలుసా?

Last Updated : Jun 13, 2021, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details