'చికెన్ తినండి ఆరోగ్యంగా ఉండండి' - Eat chicken and stay healthy
'చికెన్ తినండి ఆరోగ్యంగా ఉండండి' అంటూ కోళ్ల రైతుల సమాఖ్య ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా నందిగామలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి నందిగామ ఎమ్మెల్యే మెుండితోక జగన్మోహన్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చికెన్ గుడ్లు తినడం వల్ల కరోనా వైరస్ వ్యాపించదని కృష్ణాజిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు అన్నారు. నందిగామలో కోళ్ల రైతుల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అపోహలను విడనాడాలని సూచించారు. బాగా ఉడకబెట్టిన కోడి గుడ్లు చికెన్ తినడం వల్ల ఆరోగ్యం లభిస్తుందన్నారు. అపోహల వల్ల పౌల్ట్రీ రంగంపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు నష్టపోతున్నారని తెలిపారు. అనంతరం ప్రజలకు చికెన్ పంపిణీ చేశారు.