విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం పవిత్రోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 13 (మంగళవారం) నుంచి 16 (శుక్రవారం) వరకు వేడుకలు జరగనున్నాయి. ఏటా శ్రావణ శుద్ధ త్రయోదశి నుంచి బహుళ పాడ్యమి వరకు ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే పలు ఆర్జిత సేవలను అధికారులు నిలిపివేశారు. పవిత్రోత్సవాలు తిలకించేందుకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు.
పవిత్రోత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు - pavitrotsavalu
పవిత్రోత్సవాలకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం శోభాయమానంగా ముస్తాబైంది. వేలాదిగా తరలిరానున్న భక్తులకు ఆటంకం కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఇంద్రకీలాద్రి