ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీఎస్టీ వసూళ్లలో వ్యాపారుల పక్షాన అధికారులు.. ఖజానాకు రూ.198కోట్ల నష్టం : కాగ్ - రాష్ట్రానికి నష్టం

Gst loss : గూడ్స్ సర్వీస్ టాక్స్ వసూళ్ల విషయంలో రాష్ట్ర పన్నుల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రత్యేకించి పలు రంగాలకు చెందిన డీలర్లకు అనుచిత లబ్ధి కల్పించింది. పన్ను మినహాయింపు కారణంగా రాష్ట్ర ఖజానా 198కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈ మేరకు కాగ్ తన నివేదికలో పలు వివరాలు వెల్లడించింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 31, 2023, 4:02 PM IST

Gst loss : జీఎస్టీ వసూళ్ల విషయంలో రాష్ట్ర పన్నుల శాఖ నిర్లక్ష్యం కారణంగా 198 కోట్ల రూపాయల మేర ఖజానా నష్టపోయింది. తక్కువ పన్ను మదింపు, వసూలు చేయకపోవటం, రాబటి నష్టం తదితర అంశాల్లో రాష్ట్ర పన్నుల శాఖతో పాటు ఏపీ జీఎస్టీ అధికారుల వ్యవహార శైలి కారణంగా ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు కాగ్ ఇటీవల విడుదల చేసిన తన నివేదికలో పేర్కోంది.

అధికారుల నిర్లక్ష్యం.. ఆంధ్రప్రదేశ్ వస్తు సేవల పన్ను ఏపీ జీఎస్టీకి సంబంధించి పన్ను చెల్లింపు దారుల ఇన్ పుట్ క్రెడిట్స్ విషయంలో ఏపీ అధికారుల నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ఖజానాను కోట్ల రూపాయల మేర నష్టపోయేలా చేస్తోంది. ట్రాన్సిషనల్ క్రెడిట్స్ విషయంలో వాణిజ్య పన్నుల శాఖ నిర్లిప్తంగా వ్యవహరించటం, మదింపు తక్కువ చేసి చూపడం వంటి కారణాలతో మొత్తంగా 198 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు స్పష్టమవుతోంది.

వ్యాపారులకు అనుచిత లబ్ధి.. 563 క్లెయిమ్​ల విషయంలో ఈ ట్రాన్సిషనల్ క్రెడిట్స్​ను పరిశీలించకపోవటం, ఇన్​పుట్ క్రెడిట్ మొత్తాలను అధికంగా జమచేయటం ద్వారా కొందరు వ్యాపారులకు అనుచిత లబ్ధి కలిగించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో 13 మంది డీలర్లకు సంబంధించి 14.5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉన్నా కేవలం 5 శాతం మాత్రమే పన్నుగా పరిగణించటం కారణంగా ఖజానాకు 3.59 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు తేలింది. ఇదే అంశాన్ని ఇటీవల కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడా తన నివేదికలో పేర్కోంది.

టెలివిజన్ సెట్ టాప్ బాక్సుల విషయంలో... టెలివిజన్ కేబుల్ సెట్ టాప్ బాక్సులకు సంబంధించిన ఓ వ్యవహారంలో మినహాయింపు ఇవ్వటంతో 3.09 కోట్ల రూపాయల పన్నును ఏపీ జీఎస్టీ కోల్పోయినట్టు కాగ్ కూడా పేర్కోంది. దీంతో పాటు డీలర్లకు అనుచిత లబ్ధి కలిగేలా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వ్యవహరించటంతో 7.08 కోట్ల రూపాయల జరిమానా విధించకుండా వదిలేసినట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతీయ వాణిజ్య పన్నుల శాఖల కార్యాలయాల పరిధిలో వివిధ డీలర్లు, వ్యాపారుల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరించటంతో వారికి అనుచిత లబ్ధి కలిగినట్టుగా కాగ్ ఇటీవల సమర్పించిన తన నివేదికలోనూ పేర్కోంది.

వ్యాట్ నియమాల ఉల్లంఘన... ఏపీ వ్యాట్ పన్ను నియమాలను ఉల్లంఘిస్తూ అసలు ఇన్ పుట్ క్రెడిట్ క్లెయిమ్ చేసేందుకు అర్హత లేని డీలర్లకు 1.25 కోట్ల రూపాయల ఇన్ పుట్ క్రెడిట్ ను అనుమతించారని వెల్లడవుతోంది. దీంతో పాటు సదరు డీలర్లు వసూలు చేసిన 88 లక్షల రూపాయల పన్నును కూడా ప్రభుత్వానికి జప్తు చేయలేదని వెల్లడవుతోంది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details