రక్షణ పరికరాల కొనగోళ్ల వ్యవహారంలో తనను అరెస్ట్ చేయకుండా నిలువరించాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి తీర్పును వాయిదా వేశారు. తీర్పు వచ్చే వరకు పిటిషనర్ అరెస్ట్‌పై స్టే ఇస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు. ఏబీ వెంకటేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు... ప్రభుత్వం తరపున ఆడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపించారు.
'తీర్పు వచ్చేదాకా ఏబీ వెంకటేశ్వరరావును అరెస్ట్ చేయవద్దు'
రక్షణ పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు తాత్కాలిక ఊరట లభించింది. పిటిషనర్ అరెస్ట్‌పై స్టే ఇస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది.
AB Venkateswara Rao