ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి కొడాలి నానికి డిప్రెషన్, ఒత్తిడి ఎక్కువైంది: దివ్యవాణి - తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి వార్తలు

రాజధాని రైతులు, మహిళలు... తన ఫోటోలకు చేసిన శవయాత్ర చూశాక.. మంత్రి కొడాలి నానికి డిప్రెషన్, ఒత్తిడి ఎక్కువైందని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. న్యాయంగా, ధర్మంగా మాట్లాడేవారు అంతా నానికి జంతువుల్లా కనిపిస్తున్నారని మండిపడ్డారు. విడదల రజనీ, రోజా వంటి వారు గతంలో జగన్​ను, రాజశేఖర్ రెడ్డిని ఏమన్నారో నానికి తెలియదా అని ప్రశ్నించారు.

divyawani comments
divyawani comments

By

Published : Sep 10, 2020, 7:56 PM IST

వల్లభనేని వంశీ.. జగన్ భార్యను జైలుకు పంపుతానన్నది నిజం కాదా అంటూ తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణిి నిలదీశారు. సొమ్మొకడిది.. సోకు ఒకడిది అన్నట్లుగా రాజధానికి భూములిచ్చిన రైతులను పేదలకు ఎలా పంచుతారని ధ్వజమెత్తారు. మంత్రి కొడాలి నాని ఏది పడితే అది మాట్లాడితే.. మహిళలు ఊరుకోరన్నారు.

జగన్ కోసం విజయమ్మ, షర్మిల రోడ్లపైకి వచ్చినప్పుడు తెదేపా వాళ్లెవరూ ఇంత అసహ్యంగా మాట్లాడలేదని దివ్యవాణి తెలిపారు. రాజధాని రైతులకు, పేదలకు మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని వైకాపా చూస్తోందని ఆరోపించారు. మహిళలు చేసిన శవయాత్రతో మంత్రికి డిప్రెషన్, ఒత్తిడి ఎక్కువైందని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details