కృష్ణాజిల్లా మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు హత్యకేసులో ప్రధాన నిందితుడు చింతా చిన్నిని జిల్లా బహిష్కరణ చేస్తూ కలెక్టర్ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. 6 నెలలపాటు బహిష్కరణ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చారు. మోకా భాస్కరరావు హత్య కేసులో చింతా చిన్ని ప్రధాన నిందితుడని.. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
మోకా భాస్కరరావు హత్యకేసులో ప్రధాన నిందితుడు జిల్లా బహిష్కరణ - Machilipatnam Mayor Venkateswaramma news
కృష్ణాజిల్లా మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసులో నిందితుడైన చింతా చిన్నిని జిల్లా బహిష్కరణ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
చింతా చిన్ని
కోర్టు తీర్పుతో ఇటీవల ఎన్నికల కోసం చింతా చిన్ని మచిలీపట్నం వచ్చాడు. మోకా భాస్కరరావు భార్య వెంకటేశ్వరమ్మపై కార్పొరేటర్‌గా పోటీచేసి ఓడిపోయాడు. ఆమె ఎన్నికలలో గెలిచి మచిలీపట్నం మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదీ చూడండి. వైకాపా నేత దారుణ హత్య.. నిందితుల కోసం పోలీసుల గాలింపు