ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయ ముట్టడికి ప్రజల యత్నం - dumping yard

గన్నవరం తహసీల్దార్ కార్యాలయం ముట్టడికి సావరగూడెం వాసులు యత్నించారు. తమ గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.

సావరగూడెం వాసుల ఆందోళన

By

Published : Jun 14, 2019, 5:33 PM IST

సావరగూడెం వాసుల ఆందోళన

కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావరగూడెం గ్రామ సమీపంలో ఘన వ్యర్ధ నిర్వహణ కేంద్ర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గన్నవరం తహసిల్దార్ కార్యాలయం ముందు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి కేవలం అర కిలోమీటరు దూరంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం ఏంటని అధికారులను నిలదీశారు. తహసిల్దార్ కార్యాలయం ముట్టడికి గ్రామస్తులు ప్రయత్నించారు. రంగంలోకి దిగిన గన్నవరం సీఐ రవికుమార్ గ్రామస్థులతో తహసిల్దార్ మధుసూదనరావును చర్చలకు ఆహ్వానించారు. డంపింగ్ యార్డు ఏర్పాటుపై నివేదిక పంపిన అధికారుల పేర్లను బహిర్గతం చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేశారు. రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. సావరగూడెం వాసుల ఆందోళనతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details